: షిమోగా నుంచి యెడ్యూరప్ప పొటీ


ఇటీవలే బీజేపీలోకి తిరిగి వచ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప షిమోగా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి యెడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ఎంపీగా ఉన్నారు. ఆయన తన స్థానాన్ని తండ్రి కోసం త్యాగం చేయనున్నారు. మరో బీజేపీ నేత అనంతకుమార్ బెంగళూరు దక్షిణ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, ఆధార్ ప్రాజెక్టు అధిపతి నందన్ నిలేకని కూడా కాంగ్రెస్ తరఫున పోటీకి దిగనున్నారు.

యెడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలు శోభా కరంద్లాజె మైసూర్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడ ఉడుపి లేదా చిక్ మంగళూరు స్థానం నుంచి పోటీకి దిగవచ్చు. లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి పోటీ చేయనున్న 21 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ఖరారు చేసింది. కాంగ్రెస్ కూడా లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను దాదాపుగా ఖరారు చేసింది. వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News