: రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో ప్రారంభమైన వాదనలు
రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. పయ్యావుల కేశవ్, సీఎం రమేష్, రఘురామ కృష్ణంరాజులతో పాటు పలువురు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు విభజనకు వ్యతిరేకంగా 9 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, సుప్రీంకోర్టు అన్ని పిటిషన్లను ఒకేసారి విచారణకు స్వీకరించింది. జస్టిస్ జె.ఎల్.దత్తు, జస్టస్ బోబ్డేలతో కూడిన ధర్మాసనం వీటిని విచారిస్తోంది.