: టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసిన ముగ్గురు టీడీపీ రెబెల్స్


ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు... రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు ఓటు వేశారు. వీరిలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హన్మంత్ షిండే, హరీశ్వర్ రెడ్డిలు ఉన్నారు. వీరంతా తమ ఓటును పోలింగ్ ఏజెంటుకే కాక... అందరికీ చూపించారు. ఈ వ్యవహారంపై టీడీపీ పోలింగ్ ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే... ఏ సభ్యుడయినా తాము వేసిన ఓటును బహిరంగంగా చూపించరాదని... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరో ట్విస్ట్ ఏమిటంటే... తాను టీఆర్ఎస్ లో చేరినప్పటికీ, టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను కాబట్టి... తాను టీడీపీ అభ్యర్థికే ఓటు వేస్తానని కొద్ది రోజుల క్రితం హన్మంత్ షిండే వ్యాఖ్యానించారు. కానీ , ఈ రోజు ఆయన మాట తప్పారు.

  • Loading...

More Telugu News