: సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నారు: టీడీపీ ఎంపీ సుజనా చౌదరి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీమాంధ్ర నేతల సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లుతో సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నారని రాష్ట్రపతికి తెలిపామని ఆయన చెప్పారు. గడచిన పది సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యను.. పది రోజుల్లో పరిష్కారం చేయడం తగదన్న అభిప్రాయాన్ని ప్రణబ్ ముఖర్జీకి వివరించి చెప్పామని సుజనా చౌదరి వెల్లడించారు.