: యూట్యూబ్ ను ఊపేసిన ప్రియాంక చోప్రా అందాలు
బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా యూట్యూబ్ ను ఊపేసింది. ఇంటర్నేషనల్ ర్యాప్ స్టార్ పిట్ బుల్ తో కలిసి ఆమె ఆలపించిన సింగిల్ 'ఎక్సోటిక్' ను ఇప్పటివరకు యూట్యూబ్ లో మూడు కోట్ల మంది వీక్షించారట. ఇంగ్లిష్, హిందీ లిరిక్స్ తో గతేడాది రిలీజైన ఈ పాప్ గీతం వరల్డ్ మ్యూజిక్ చార్ట్స్ లో హల్ చల్ చేసింది. ఈ సందర్భంగా ప్రియాంక ట్వీట్ చేస్తూ, 'ఫ్యాన్స్ నా మీద చూపిస్తున్న అభిమానానికి, అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు' అని పేర్కొంది.