: లంక వ్యతిరేక నిరసనల్లో తమిళ 'డైరెక్షన్'
శ్రీలంక తమిళులకు మద్దతుగా తమిళనాడులో పెల్లుబికిన నిరసన ధ్వనులకు తాజాగా దర్శకులూ గొంతు కలిపారు. లంక తమిళులపై ఆ దేశ సైన్యం దురాగతాలను వ్యతిరేకిస్తూ తమిళనాడు వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తమిళ దర్శకుల సంఘం కూడా వీరికి మద్దతు పలికింది. తమిళ దర్శకుల సంఘం సభ్యులు.. ఎం. అమీర్ నేతృత్వంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ప్రసిద్ధ దర్శకులు శంకర్, ఏఆర్ మురుగదాస్, బాలాజీ శక్తివేల్ తదితరులు లంక తమిళులకు తమ సంఘీభావం తెలిపారు.