: విభజన సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మంచివి కావు: తెలంగాణ ప్రజాప్రతినిధులు
రాష్ట్ర విభజన సందర్భంగా జరుగుతున్న పరిణామాలు మంచివి కాదని, ప్రజల్లో విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లుపై గందరగోళం మధ్య తీర్మానాన్ని ఆమోదింపచేసినట్టు రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. ఏపీ భవన్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల వంటివి, విభజన జరగకపోతే చోటు చేసుకునే అవకాశం ఉందని వారు రాష్ట్రపతికి స్పష్టం చేసినట్టు తెలిపారు.