: రథసప్తమి పర్వదినాన తిరుమలేశునికి సప్త వాహన సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామికి సప్త వాహన సేవలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం ప్రభాత సమయంలో శ్రీవారు వాయవ్య దిశకు చేరుకోగానే సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. దీంతో అర్చకులు హారతినిచ్చి.. స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగించారు. సూర్యప్రభ వాహన సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం చిన్నశేష వాహన సేవ, గరుడ వాహన సేవ, హనుమంత వాహన సేవ వంటి వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో విహరించారు. ఇక, సంధ్యా సమయంలో శ్రీవారు సర్వభూపాల వాహనంపై తిరువీధుల్లో విహరిస్తున్నారు.