: రాష్ట్రపతితో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లుకు సంబంధించిన అంశాలను వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. విభజన అనివార్యమని, తాము ముఖ్యమంత్రి అదేశాలకు లోబడి నడచుకోవడం లేదని, ఏళ్ల నాటి ప్రజాకాంక్షను నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతికి వారు తెలిపారని సమాచారం. కాగా, సాయంత్రం 6:30కి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రపతితో భేటీ అవుతారు. అనంతరం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం ఎంపీలు రాష్ట్రపతిని కలవనున్నారు.

  • Loading...

More Telugu News