: ఇంటికొకరు చొప్పున రాజకీయాల్లోకి రండి: చంద్రబాబు
రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు రావాలంటే ఇంటికొకరుగా రాజకీయాల్లోకి చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న చంద్రబాబు చంద్రవరంలో బహిరంగసభలో ప్రసంగించారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లు కుంభకోణాల పార్టీలని బాబు విమర్శించారు.