: రాష్ట్రపతిని కించపరిచేలా కేంద్ర హోం శాఖ వ్యవహరిస్తోంది: కోడెల
కేంద్ర హోం శాఖ తీరు రాష్ట్రపతిని కించపరిచేలా ఉందని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను పట్టించుకోకుండా 10 రోజుల్లో రాష్ట్రాన్ని విడదీయాలని చూడడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానివి ప్రజా వ్యతిరేక విధానాలని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ఉభయసభలు తిరస్కరించిన బిల్లును పరిశీలించకుండా, మంత్రుల బృందం ఏ ప్రాతిపదికన ఆమోదిస్తుందని కోడెల నిలదీశారు. ఇంట్లో కూర్చుని మూడు గంటలకోసారి లోపలికి వెళ్లి వస్తూ, దాన్ని దీక్ష అన్న జగన్ లాంటి వారిని తానెన్నడూ చూడలేదని అన్నారు. రైతు రుణమాఫీ జగన్ కు ఇష్టం లేదని, అందుకే దానిపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారని కోడెల ఆరోపించారు.