: రాయితీలపై భారత్ కు యూఎన్ మాజీ సెక్రెటరీ హెచ్చరిక


ప్రస్తుత భారతదేశంలోని ప్రభుత్వాలన్నీ ప్రజాకర్షక పథకాలే ప్రవేశపెట్టాయనడంలో సందేహం లేదు. వాటిలో అనేక పథకాలున్నాయి. తక్కువ మొత్తానికే ఎక్కువ వస్తువులు, మాకు ఓటేస్తే మీకవి ఇస్తాం, యువకులను ఆకర్షించే పథకాలు... ఇలా దేశంలో ఎన్నో ఉన్నాయి. కానీ, వీటిపై యూఎన్ (ఐక్యరాజ్య సమితి) మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ భారత్ ను హెచ్చరించారు. ఓ ప్రముఖ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోఫీ.. ప్రభుత్వాలు నిరంతరంగా ప్రజలకు రాయితీలు కల్పించడంపై వివరాణాత్మకంగా మాట్లాడారు. ఇందులో ప్రధానంగా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆహార భద్రత బిల్లు, ఆమ్ ఆద్మీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్న మంచినీరు, విద్యుత్ హామీలపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు.

ఇలాంటి రాయితీల వల్ల వారిపై విలువ లేకుండా పోతుందన్నారు. రాయితీలనేవి చాలా కష్టతరమైన అంశాలని, ఒకసారి మంజూరు చేస్తే వెనక్కి తీసుకోవడం మరింత కష్టసాధ్యమని కోఫీ పేర్కొన్నారు. అనుమతివ్వడం (రాయితీలు), వెనక్కి తీసుకోవడం (అధికారాలు) అనే రెండు విషయాలు ప్రపంచంలో అతి కష్టమైనవని తాను ప్రతిసారి చెబుతుంటానన్నారు. అయితే, ప్రధానంగా ఆహార రాయితీలు అపారంగా ఉండకూడదని చెప్పారు. పేదరికంలో ఉన్నవారికి సహాయం చేయడంవల్ల సమస్యల నుంచి, పేదరికం నుంచి వారు బయటపడతారని.. తర్వాత వారు సొంతంగా మనగలిగేందుకు పరిస్థితులు సహాయపడతాయని కోఫీ అన్నారు

  • Loading...

More Telugu News