: సడక్ బంద్ కి ఇంటికొకరు చొప్పున రండి : ఈటెల
తెలంగాణ ఆకాంక్షను తెలియజెప్పే సడక్ బంద్ కు తెలంగాణ బిడ్డలు ఇంటికొకరుగా తరలి రావాలని టీఆర్ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. బంద్ కు అనుమతి లేదంటూ మహబూబ్ నగర్ ఎస్సీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని ఈటెల ఘాటుగా వ్యాఖ్యానించారు. సడక్ బంద్ కు అనుమతివ్వాలని హోంమంత్రి సబితను కోరినా సమాధానం లేదని విమర్శించారు.