: సోనియా గాంధీ, షిండే, జైరాం రమేష్ భేటీ
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీవోఎంలో కీలక సభ్యులైన కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. జీవోఎం నివేదికలోని అంశాలను సోనియా గాంధీకి వివరించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల విజ్ఞప్తులను, వాటిలోని ఇబ్బందులను కూడా సోనియాకు తెలిపారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జీవోఎం సూచించిన పరిష్కారాల గురించి వివరించినట్టు సమాచారం.