: బిల్ క్లింటన్ తో నాకేమీ అఫైర్ లేదు: ఎలిజబెత్ హ్యార్లీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో గత సంవత్సర కాలంగా అఫైర్ ఉందనే వార్తలను హాలీవుడ్ తార ఎలిజబెత్ హ్యార్లీ ఖండించారు. బిల్ క్లింటన్ తో అఫైర్ ఉందని తన బాయ్ ఫ్రెండ్ టామ్ సైజ్ మోర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఆమె ట్వీట్ చేశారు. ‘‘క్లింటన్ తో అఫైర్ ఉందనటం అవాస్తవం. ఇది చాలా తెలివితక్కువ పని. అయినా నా లాయర్లు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు’’ అని హ్యార్లీ ట్విట్టర్ లో స్పందించారు. ‘నేను ఎప్పుడూ క్లింటన్ ను కలవనేలేదు’ అని ఆమె పేర్కొంది.
1992లో రూపొందించిన ‘పాసింజర్ 57’ అనే సినిమా సందర్భంగా ఎలిజబెత్ హ్యార్లీకి, సైజ్ మోర్ కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు. 1998లో వైట్ హౌస్ లో ‘సేవింగ్ ప్రైవేట్ ర్యాన్’ సినిమాని ప్రదర్శించినపుడు తాను బిల్ క్లింటన్ కు హ్యార్లీని పరిచయం చేశానని ఆమె బోయ్ ఫ్రెండ్ సైజ్ మోర్ తెలిపారు.