: ఐపీఎల్ లో లంక ఆటగాళ్ల స్థానాలపై నీలినీడలు


శ్రీలంక తమిళుల వ్యవహారంలో తమిళనాడు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఆరవ సీజన్ లో లంక క్రికెటర్లు ఆడే విషయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో వారిని ఆడనిస్తారా? లేక అడ్డుకుంటారా ? అనే అంశంపై ఉత్కంఠ చోటు చేసుకుంది. ఐపీఎల్ లో మొత్తం తొమ్మిది జట్లు ఉన్నాయి. వీటిలో పలువురు కీలక శ్రీలంక ఆటగాళ్లు ఉన్నారు. ప్రధానంగా 'చెన్నైసూపర్ కింగ్స్' జట్టులోనూ లంక ఆటగాళ్లు ఉన్నారు.

రాబోయే సీజన్లో దాదాపు 10 మ్యాచులు చెన్నైలో జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, లంక ఆటగాళ్లు లేకుండానే చెన్నై జట్టు మ్యాచులు ఆడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ 3న అట్టహాసంగా ఐపీఎల్ మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో లంక ఆటగాళ్లను ఆడించవద్దని బీసీసీఐ ఆయా జట్లను కోరనుందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News