: జగన్ ఓ అపరిచితుడు: మాజీ మంత్రి మారెప్ప


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై మాజీ మంత్రి మారెప్ప మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమైక్య ముసుగు వేసుకున్న విభజనవాది జగన్ అని ఆరోపించారు. ఆయనో అపరిచితుడని ఎద్దేవా చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఆయన పరిపాలన హిట్లర్, ముస్సోలినీల కంటే భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి కల ఎన్నటికీ నెరవేరదని జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News