: సోమవారం పార్లమెంటు ముందుకు తెలంగాణ బిల్లు
తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు సోమవారం రానుంది. రేపు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ బిల్లును ఆమోదించనున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు చేసిన సూచనల మేరకు కొన్ని సవరణలు చేసి సోమవారం పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్ధీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా ఆర్థిక సాయం చేసేందుకు పలు సవరణలు చేశారని సమాచారం. అలాగే రాజధాని, పోలవరం, భద్రాచలంలోని కొన్ని గ్రామాలు, ఆదాయం పంపకాలపై పలు సవరణలు చేశారని సమాచారం.