: 18ఏళ్లకే పరస్పర సమ్మతి శృంగారం


ఇవాళ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పై జరిగిన చర్చలో విపక్షాలు పలు సవరణలు సూచించాయి. ఇందులో భాగంగా పరస్పర సమ్మతితో కూడిన శృంగారానికి కనీస వయస్సు 18 ఏళ్లుగానే ఉంచేందుకు సర్కారు అనుమతించింది. దీనిని తొలుత ప్రభుత్వం 16 ఏళ్లకు తగ్గించాలని భావించి ఆనక వెనక్కితగ్గింది. 

ఇంకా.. అత్యాచార కేసులలో బాధితురాలు చనిపోయినా, లేదా జీవచ్చవంగా మారినా సదరు దోషికి మరణ శిక్ష, అత్యాచారం కేసులో కనీస శిక్ష 20 ఏళ్ల జైలు, లేదా గరిష్ట స్థాయిలో చనిపోయేంతవరకూ జైలు శిక్ష విధించాలని నిర్ణయించారు. అయితే, ఆర్డినెన్స్ లో ఉన్న నిబంధనలను యథాతథంగా ఉంచేందుకు నిర్ణయించారు.   

  • Loading...

More Telugu News