: రాజ్యసభ బరి నుంచి తప్పుకున్న ఆదాల


రాజ్యసభ ఎన్నికల బరి నుంచి స్వతంత్ర అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సూచన మేరకు తాను పోటీ నుంచి వైదొలగుతున్నానని అన్నారు. ఇప్పటికీ తనకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అయితే వైఎస్సార్సీపీని నమ్ముకుని బరిలో ఉండడం సరికాదని భావించి తాను పోటీ నుంచి వైదొలుగుతున్నానని ఆదాల స్పష్టం చేశారు. తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలని తెలిపారు.

  • Loading...

More Telugu News