: సల్మాన్ చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నాడు


జయహో చిత్రంలో సామాన్యుల హక్కుల కోసం సల్మాన్ పోరాటం సాగిస్తాడు. కానీ, చిత్రంలో నటించినది.. బయట ఆచరించి చూపుతున్నాడు. తోటి నటుడు సంతోష్ శుక్లా సోదరుడు అశుతోష్(34) కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుంటున్నట్లు సల్మాన్ కు తెలిసింది. అంతే 5లక్షల రూపాయలను వైద్యసాయం కింద అందించాడు. 'అడగకుండానే భాయ్ సాయం చేశాడు. ఆపరేషన్ పూర్తయింది. ప్రస్తుతం అశుతోష్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇంకా డిశ్చార్జి కాలేదు. పూర్తిగా కోలుకున్నాక సల్మాన్ ను కలమని కోరతా' అని సంతోష్ శుక్లా తెలిపాడు. సల్మాన్ చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం కూడా నిధుల సాయం అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News