: లేచిపోయి చచ్చిపోయాడు!
ఇదేదో సినిమాలో విన్న డైలాగ్ లా అనిపిస్తున్నా, వాస్తవంలోనూ అదే జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ ప్రాంతంలోని దమేరాలో ఓ యువకుడు నిఖా సమయంలో హత్యకు గురయ్యాడు. ఓ యువతిని ప్రేమించిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడు. పెద్దలను ఎదిరించి తాను ప్రేమించిన యువతితో వెళ్ళిపోయి ఈ ఉదయం వివాహం చేసుకుంటుండగా, కొందరు దుండగులు అతడిని చంపేశారు. హంతకులు యువతి బంధువులని భావిస్తున్నారు. కాగా, ఈ దాడి నుంచి ప్రేమికుడి సోదరుడు, యువతి తప్పించుకున్నారు.