: కర్నూలు కలెక్టరేట్ లో కంప్యూటర్లు పగిలిపోయాయ్
సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎన్జీవోలు బుధవారం అర్థరాత్రి నుంచి సమ్మె చేపట్టిన విషయం విదితమే. ఇవాళ్టి నుంచి వారు విధులకు హాజరు కాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలకు పడ్డ తాళాలను తెరవలేదు. అయితే కొన్నిచోట్ల మాత్రం కార్యాలయాలు తెరిచినా.. ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో అవి బోసిపోయాయి.
కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఎన్జీవో నేతలు దాడికి దిగారు. కలెక్టరేట్ లోకి దూసుకెళ్లి నానా హంగామా చేశారు. వీడియో కాన్ఫరెన్స్ హాలులోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లును పగులగొట్టారు. తమ సమ్మెను పట్టించుకోకుండా.. కలెక్టరేట్ కార్యాలయం తాళాలు తీయడమే వారి ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది.