: అర కిలో బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చి...


దుబాయ్ నుంచి అరకిలో బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చాడు. అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కాడు. దుబాయ్ ఎయిర్ లైన్స్ విమానంలో వరంగల్ జిల్లా వాసి ఖాజా (30) హైదరాబాదు నగరానికి వచ్చాడు. విమానం దిగిన తర్వాత, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారుల చేతికి చిక్కాడు.
కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఖాజా వద్ద అరకిలో బంగారం బయటపడింది. బంగారానికి పన్ను సుంకం చెల్లించకపోవడంతో ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖాజా షూ సాక్సుల్లో నాలుగు బంగారు బిస్కెట్లు, ఓ ఉంగరం ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన స్వర్ణం సుమారు 565 గ్రాములు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో ఈ బంగారం విలువ 17 లక్షల 56 వేలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News