: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అంగీకరించం: ప్రకాశ్ కారత్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తాము అంగీకరించేది లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన దేశానికి చేటు చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. మెజారిటీ ప్రజల అభ్యంతరాలను, రాష్ట్ర ఉభయసభల నిర్ణయాలను పట్టించుకోకుండా విభజన అంటే సరికాదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News