: టూత్ పేస్ట్ బాంబులున్నాయి జాగ్రత్త: అమెరికా హెచ్చరిక


రష్యాలోని సోచిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా విమాన సర్వీసులను నడిపే దేశ, విదేశీ ఎయిర్ లైన్స్ సంస్థలను అమెరికా నిఘా అధికారులు హెచ్చరించారు. టూత్ పేస్టు బాంబులపై అప్రమత్తంగా ఉండాలని.. ఉగ్రవాదులు టూత్ పేస్టులలో బాంబులను అమర్చి విమానాలను పేల్చే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. ప్రయాణికులను, వారి లగేజీలను, విమానం లోపల చాలా క్షుణ్ణం తనిఖీ చేయాలని సూచించింది. రష్యా అధికారులతో కలసి సోచి ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News