: ఎన్ని కుట్రలు పన్నినా..తెలంగాణ బిల్లు పాసవుతుంది: టీఆర్ఎస్ నేత వినోద్
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు చివరివరకు అడ్డంకులు కలుగజేస్తూనే ఉంటారని టీఆర్ఎస్ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వినోద్ కుమార్ చెప్పారు. ఇవాళ (గురువారం) హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ వద్ద వినోద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ సభ్యులందరూ అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని, అవాస్తవమైన అంశాలతో వారు జాతీయ నేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు కలుగజేసినా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మద్దతుతో తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదాన్ని పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.