: న్యూజిలాండ్ లో విరాట్ చెంత అనుష్క!
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ మధ్య ఏదో ఉందని కొన్నాళ్ల నుంచి మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ వీళ్లిద్దరూ తాజాగా న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ ప్రాంతంలో జంటగా తిరుగుతూ కెమెరాకు చిక్కారు. ఇప్పుడా ఫొటో, వార్త వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తూ.. ఇద్దరి మధ్య ప్రేమాయణం వాస్తవమనేందుకు సాక్ష్యంగా మారింది. ట్విట్టర్లో అయితే అభిమానులు తమ కామెంట్లను వరుసగా పోస్ట్ చేస్తున్నారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ లో జరిగే టెస్టు మ్యాచ్ కోసం భారత్ జట్టు ఇప్పటికే అక్కడ ఉంది. వారి వెనకే వెళ్లిన అనుష్క... ప్రియుడు విరాట్ తో కలసి అక్కడి అందమైన ప్రదేశాల్లో ప్రత్యేకమైన సమయాన్ని గడుపుతోందని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున విరాట్ విమానాశ్రయం నుంచి నేరుగా ముంబయిలోని అనుష్క ఇంటికి వెళ్లి పార్టీ ఎంజాయ్ చేశాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ, తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని వారు అప్పట్లో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎంత దాచి ఉంచినా ప్రేమ మాత్రం దాగదు అంటే ఇదేనేమో కదా?