: జయలలితతో చంద్రబాబు భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర సమస్యపై జాతీయ నేతలను కూడగడుతున్నారు. ఈ మేరకు ఈ ఉదయం చెన్నై వెళ్లిన బాబు ఎఐఎడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును జయకు బాబు వివరించనున్నారు. ఒంటిగంట తర్వాత డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశమవుతారు.