: ఢిల్లీలో హేమమాలిని చిన్న కూతురి రిసెప్షన్.. బీజేపీ ప్రధాన నేతలు హాజరు
నటులు ధర్మేంద్ర, హేమమాలినిల చిన్న కుమార్తె అహన డియోల్ వివాహం పారిశ్రామికవేత్త వైభవ్ వోరాతో ఈ నెల 2న ముంబయిలో జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడే బాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ జరిగింది. కాగా, ధర్మేంద్ర, హేమ ఇద్దరూ బీజేపీకి చెందిన నేతలు కావడంతో నిన్న రాత్రి ఢిల్లీలో కూడా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రిసెప్షన్ కు బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, కేంద్రమంత్రి రాజీవ్ శుక్లా, ఎంపీ రేణుకా చౌదరి, తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.