: చంద్రబాబు ఒత్తిడికి బీజేపీ తలొగ్గదు: కోదండరాం
ఈ రోజు రాష్ట్రపతిని కలసినప్పుడు, ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరతామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. మెజారిటీ సీట్లు ఉన్న ప్రాంతం వారు మైనారిటీ ప్రాంతాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కాకుండా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో ఆయన నిజస్వరూపం బయటపడిందని... ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. బాబుతో పాటు సీఎం కిరణ్, జగన్ లు రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. బీజేపీ ఒక జాతీయ పార్టీ అని... చంద్రబాబు చెప్పినట్టుగా ఆ పార్టీ వ్యవహరించదని... బాబు ఒత్తిడికి తలొగ్గదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.