: స్నేహితుడు సత్య నాదెళ్లకు జంషెడ్ పూర్ ఎంపీ శుభాకాంక్షలు
జార్ఖండ్ వికాస్ మోర్చా-ప్రజాతంత్రిక్ (జేవీఎం) పార్టీ నుంచి జంషెడ్ పూర్ ఎంపీ అయిన డాక్టర్ అజయ్ కుమార్ తన స్నేహితుడు, మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా నియమితుడయిన సత్య నాదెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నిన్న (బుధవారం) ఓ సందేశాన్ని పంపారు. ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ కు భారత్ కు చెందిన వ్యక్తి సత్య సీఈవో కావడం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో తామిద్దరమూ ఒకే పాఠశాలలో చదువుకున్నప్పుడు స్నేహితులమని ఎంపీ తెలిపారు. అయితే, జంషెడ్ పూర్ ను సందర్శించి, ఐటీ సెక్టార్ ను ప్రచారం చేయడంలో భాగంగా యువకులను ప్రోత్సహించాలని కోరుతూ త్వరలో సత్యను ఆహ్వానిస్తామని వివరించారు.