: ఆందోళన ఘర్షణాత్మకం
ఆందోళనకారుల రాళ్ళ దాడి, పోలీసుల లాఠీ చార్జ్ తో తూర్పుగోదావరి జిల్లా దొంతుమూరు గ్రామం రణరంగంగా మారింది. విద్యుత్తు, ఎరువుల కర్మాగారం ఏర్పాటులో భాగంగా జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణను ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీంతో పరిశ్రమల యాజమాన్యాల వర్గాలు వారిపై తిరగబడ్డాయి. ఇరువైపులా వారు రాళ్ళు రువ్వుకున్నారు. దీంతో కొంత మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని నిలువరించే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా ఇద్దరు గాయపడ్డారు. ఆందోళనకారుల నిరసన కొనసాగుతోంది.