: యూటీ చేస్తే ఒప్పుకోం.. సీఎం చరిత్రహీనుడవుతారు: ఎంపీ పొన్నం


సీమాంధ్ర కేంద్ర మంత్రులతో జీవోఎం భేటీల నేపథ్యంలో, హైదరాబాద్ యూటీ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. హైదరాబాద్ ను యూటీ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు తథ్యమని, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని అన్నారు. తొమ్మిది ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని దోషిగా చూశారని... ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేస్తోందని తెలిపారు. సీఎం కిరణ్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు విభజనకు అనుకూలంగా ఉన్నాయిని... సోనియా, సుష్మాస్వరాజ్ లు వెనక్కి తగ్గరని తెలిపారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News