: పెప్సీ భారతీయ పాప్ టీవీ చానల్
మన పాప్ గీతాలు ఇకపై 24 గంటలూ మనల్ని ఉర్రూతలూగించనున్నాయి. ఇందుకోసం శీతల పానీయాల సంస్థ పెప్సీకో.. ఎంటీవీ ఇండియా చేతులు కలిపాయి. ఈ రెండింటి భాగస్వామ్యంతో ఇండీ పాప్ టీవీ చానల్ 'పెప్సీ ఎంటీవీ ఇండీస్' ఈ నెలాఖరు నాటికి ప్రసారాలను ప్రారంభిస్తుంది. ఈ మేరకు పెప్సీకో, ఎంటీవీ యాజమాన్య కంపెనీ వయాకామ్ 18 ఒప్పందం చేసుకున్నాయి. ఏకకాలంలో టీవీ, మొబైల్, వెబ్ ద్వారా ఈ చానల్ ప్రసారాలను అందుబాటులోకి తేనున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. 20 శాతం పాటలను తామే రూపొందిస్తామని, 50 శాతం సంగీత ఆల్బమ్ లు, మిగతా 30 శాతం భారతీయ కళాకారుల నుంచి ప్రసారాల కోసం లైసెన్స్ తీసుకుంటామని వయాకామ్ అధిపతి ఆదిత్య స్వామి తెలిపారు. ప్రాంతీయ భాషల పాప్ గీతాలను కూడా ఈ చానల్ ప్రసారం చేయనుంది.