: గుండెజబ్బు వస్తుందా.. రాదా... 18వ ఏటే తెలుసుకోవచ్చు!


వైద్య పరిశోధనలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. భవిష్యత్తులో మీ గుండెకు ముప్పు వచ్చే అవకాశం ఉంటే ఇకపై చాలా ముందుగానే పసిగట్టవచ్చు. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుని, మంచి జీవన శైలిని పాటించినట్లయితే సులువుగా సెంచరీ కొట్టేయవచ్చు. ఈ దిశగా ఇల్లినాయిస్ కు చెందిన ఫిన్ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ఒక పరిశోధన నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన తర్వాత రక్తపోటు స్థాయి ఎంత ఉంది? తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో గుండెజబ్బు వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చని ఫిన్ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నొర్రినా అల్లెన్ తెలిపారు. తద్వారా రక్తపోటు పెరగకుండా నియంత్రించడం వల్ల గుండెకు ముప్పు వాటిల్లదని ఆయన పేర్కొన్నారు.

అంతచిన్న వయసులో రక్తపోటు ఎందుకు ఉంటుంది? అన్న సందేహం రావచ్చు. నిజమే కానీ, ఆ వయసులోనూ రక్తపోటు ఒక్కొక్కరిలో కొంచెం అటు ఇటూగా ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ ఉన్నా సరే భవిష్యత్తులో హానికరంగా మారవచ్చు. ఈ తేడాలే భవిష్యత్ ముప్పును సూచిస్తాయన్నది పరిశోధకుల విశ్లేషణ. సాధారణంగా రక్తపోటు ఎక్కువ కాలం హెచ్చు, తగ్గులుగా ఉంటే రక్తనాళాల గోడలపై ప్రభావం పడుతుంది. తద్వారా మధ్య వయసుకే కరోనరీ ఆర్టరీ వ్యాధులకు కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు స్థాయులు, గుండెపై చూపే ప్రభావం గురించి 25ఏళ్ల పాటు అధ్యయనం చేసిన తర్వాత ఈ ఫలితాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News