: రాష్ట్రపతితో ఏకాంతంగా మాట్లాడిన ముఖ్యమంత్రి
జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ ఇతర సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో కలసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. అనంతరం నేతలందరూ రాష్ట్రపతితో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం సీఎం కిరణ్ రాష్ట్రపతితో ఏకాంతంగా 10 నిమిషాల పాటు మాట్లాడారు. అంతేకాకుండా, నాలుగు పేజీల వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు.