: వచ్చే ఎన్నికల్లో బప్పీలహరి పోటీ?
ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన సంగీత దర్శకుడు బప్పీలహరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. రాజస్థాన్ లోని అజ్మీర్ లేదా జైపూర్ ప్రాంతాల నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయిన సచిన్ పైలెట్ ను అజ్మీర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వినికిడి. అదే బప్పీ జైపూర్ నుంచి పోటీచేస్తే కాంగ్రెస్ నేత అయిన మహేష్ జోషీని బరిలోకి దింపాలని హస్తం అనుకుంటున్నట్లు సమాచారం. ఇలా రెండు ప్రాంతాల్లో బప్పీకి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ దూకుడుగా ఉంది. ఏది ఏమైనా, ఈసారి ఎన్నికలలో ఈ హిందీ సినీ సంగీత దర్శకుడు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.