: మహారాష్ట్రకు సీబీఐ జేడీ బదిలీ...!


అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తో పాటు కొందరు మంత్రులు, ఐఏఎస్ అధికారులనూ జైలుకు పంపడానికి వెనుకాడని ధీశాలిగా పేరుపొందిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు బదిలీ అవనున్నట్టు సమాచారం. వాస్తవానికి లక్ష్మీనారాయణ మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి. డిప్యూటేషన్ పై ఆయన సీబీఐలో విధులు నిర్వర్తిస్తున్నారు.

అయితే, ఆయన డిప్యూటేషన్ జూన్ నెలాఖరుకు ముగియనుంది. దీంతో, లక్ష్మీనారాయణను మళ్ళీ మహారాష్ట్రకే పంపాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరో అధికారి వెంకటేశ్ డిప్యూటేషన్ కూడా కొద్ది రోజుల్లో ముగియనుండడంతో.. జగన్ కేసులో ఈ నెలాఖరు లోపు చివరి ఛార్జిషీటు దాఖలు చేసేందుకు సీబీఐ కసరత్తులు ముమ్మరం చేసింది. 

  • Loading...

More Telugu News