: భారతీయ విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమే సత్య నాదెళ్ళ నియామకం
దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ కు సీఈవోగా నియమితుడైన తెలుగుతేజం సత్య నాదెళ్ళపై కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రశంసల వర్షం కురిపించాడు. సత్య నాదెళ్ళ భారతీయ విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని అభివర్ణించాడు. ఢిల్లీలోని శ్రీరామ్ కామర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత విద్యార్థులు ఇప్పుడు అమెరికా, చైనా విద్యార్థులకు సమానస్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. అందుకు సత్య నాదెళ్ళ నియామకమే రుజువని అన్నారు.