: నిరసనతోనే ఆగం.. బిల్లును కూడా ఓడిస్తాం: ఎంపీ అనంత


తాము నిరసనలతోనే ఆగమని, లోక్ సభలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి బిల్లును కూడా ఓడిస్తామని పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలు గ్రహించాలని సూచించారు. ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మెజారిటీ ప్రజలు అందరూ బిల్లును వ్యతిరేకిస్తున్నారని... అలాంటప్పుడు దేనికోసం కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలు అనుసరిస్తోందని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News