: మత హింస నిరోధక బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ వాడివేడి చర్చ
మత హింస నిరోధక బిల్లుపై రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. బిల్లు ముఖ్యోద్దేశాన్ని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ వివరిస్తూ, రాష్ట్రాలు మతహింసను ప్రోత్సహిస్తే కేంద్రం కలగజేసుకుని బాధితులకు సహాయం అందిస్తుందని అన్నారు. దీనిపై అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర అధికారాలను కేంద్రం తీసుకునేందుకు హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రాల అధికారాలను హరించే బిల్లులను రాజ్యసభ ఆమోదించదని జైట్లీ స్పష్టం చేశారు. దీంతో విపక్ష సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, బిల్లు సమాఖ్య స్పూర్థికి విరుద్ధంగా ఉందని తృణముల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది.