: టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టు
పార్లమెంటు అవుట్ గేట్ వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. పయ్యావుల కేశవ్, టీవీ రామారావు తదితరులను బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్రమైన తోపులాట చోటుచేసుకుంది. ధర్నా సందర్భంగా టీడీపీ నేతలు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' నినాదాలతో హోరెత్తించారు. కాగా, పార్లమెంట్ అవుట్ గేట్ వద్ద ధర్నాలకు అనుమతి లేదంటున్న పోలీసులు అక్కడున్న వారందరినీ బలవంతంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.