: ఈ మంత్రివర్యులు దీక్షకు దూరం దూరం!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద చేపట్టిన మౌన దీక్షకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ముగ్గురు దూరంగా ఉన్నారు. వీరంతా అధిష్ఠానం వద్ద తమ వీరవిధేయతను ప్రదర్శించుకున్నవారే కావడం విశేషం. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కిషోర్ చంద్ర దేవ్ ముగ్గురూ ముఖ్యమంత్రి దీక్షకు దూరంగా ఉన్నారు. పనబాక చాలాకాలంగా సమైక్యమంటూనే, అధిష్ఠానం ఏం చేబితే అదే తన మార్గమని స్పష్టం చేశారు. కిల్లి కృపారాణి కూడా అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు. కిషోర్ చంద్రదేవ్ విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ అధిష్ఠానం నమ్మినబంటుగా పేరుంది. దీంతో వీరు ముగ్గురూ ముఖ్యమంత్రి మౌనదీక్షకు హాజరు కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.