: లైంగికవేధింపులపై డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన నార్వే యువతి
ఇటీవల తరచూ జరుగుతోన్న అత్యాచారాలతో భారత్ పరువు గంగలో కలుస్తోంది. దేశంలో రోజూ ఏదోమూల అత్యాచారాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే స్విస్ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంతో అంతర్జాతీయంగానూ దేశం పరువు బజారున పడింది. బ్రిటన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాలు భారత్ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలంటూ తమ పౌరులకు హెచ్చరికలు కూడా జారీచేశాయి.
ఇదిలాఉంటే, తాజాగా నార్వే యువతిపై లైంగిక వేధింపుల కేసు ఒకటి నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో నమోదైంది. సికింద్రాబాద్ నుంచి షిర్డీ వెళ్తోన్న బస్సులో ప్రయాణిస్తోన్న నార్వే దేశానికి చెందిన యువతిని కొందరు ఆకతాయిలు లైంగికంగా వేధించారు. దీంతో ఆమె డిచ్ పల్లిలో బస్సు ఆపించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వేధింపులకు కారణమైన హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Loading...
More Telugu News
- Loading...