: ఈ డ్రెస్ వేసుకుంటే డాక్టర్ మీ చెంతనున్నట్లే!


మేథస్సుతో ఏదైనా సాధ్యమేనని నిరూపించారు ఫ్రాన్స్ కు చెందిన ఒక కంపెనీ పరిశోధకులు. వీరు తయారు చేసిన షర్టు వేసుకుంటే ఆరోగ్యాన్ని ఒక వైద్యుడిగా అనుక్షణం పరీక్షిస్తూ హెచ్చరిస్తూ ఉంటుంది. వీరు తయారు చేసిన వస్త్రంలో సెన్సర్లు ఏర్పాటు చేశారు. వాటిని మొబైల్ అప్లికేషన్ కు జతచేశారు. ఈ సెన్సర్లు గుండె స్పందనల తీరు, శ్వాస ప్రక్రియను గుర్తించి మొబైల్ కు సమాచారం చేరవేస్తాయి. తేడాలుంటే హెచ్చరికలు పంపుతాయి. దాంతో వైద్యుడి వద్దకు వెళ్లి సకాలంతో చికిత్స తీసుకోవడం ద్వారా ముప్పును తప్పించుకోవచ్చు. ఈ వస్త్రంతో షర్టే కాదు, అన్ని రకాల డ్రెస్ లను తయారు చేసుకోవచ్చని సిటైజెన్ అంటోంది. కాకపోతే దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News