: ఒళ్ళు మండితే ఇలాగే చేస్తారు..!


తమ ప్రాంతంలో పారిశుద్ధ్యం పడకేసిందని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోని కార్పొరేటర్ ను ప్రజలు ఏం చేశారో చూడండి! ఎత్తుకెళ్ళి ఓ చెత్తకుండీలోకి విసిరారు! ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిందీ ఘటన. స్థానిక పటేల్ నగర్లోని పలు ప్రాంతాల్లో చెత్త, మురుగు ఎక్కడివక్కడ పేరుకుపోయి దుర్గంధం వేస్తూ, అనారోగ్యం ప్రబలుతుండడం స్థానికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. ఈ విషయమై వారు లోకల్ కార్పొరేటర్ మనోజ్ యాదవ్ ను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకపోయింది.

మునిసిపల్ అధికారుల తీరూ అలానే ఉండడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. నిన్న రోడ్డుపై కనిపించన మనోజ్ యాదవ్ ను దొరకబుచ్చుకుని, నోటికొచ్చినట్టు తిడుతూ, బరబరా ఈడ్చుకెళ్ళి ఓ చెత్తకుండీలో వేశారు. రెండ్రోజుల్లో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరిస్తానని ప్రమాణం చేసిన మీదట అతడిని విడిచిపెట్టారు. ప్రజాగ్రహంతో బిక్కచచ్చిన ఆ కార్పొరేటర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గంట సేపు అలా చెత్త కుండీలో ఉండడం తట్టుకోలేకపోయానని, తక్షణమే అధికారులను, ఇతర సిబ్బందిని పంపి చెత్తను తరలించే చర్యలు మొదలు పెడతానని చెప్పాడు.

  • Loading...

More Telugu News