: జయలలితకు జోస్యం చెప్పినందుకు రూ. 10లక్షలు


జయలలిత తమిళనాడు సీఎం అవుతారు అని చెప్పిన జోస్యం నిజమైంది. ఆ జ్యోతిషుడికి 10లక్షల రూపాయలు ముట్టాయి. కానీ, దీని కోసం ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కేరళకు చెందిన ఉన్నికృష్ణన్ పానికర్ 2001లో జయలలిత తమిళనాడు సీఎం అవుతారని ముందే చెప్పారు. కానీ, అప్పట్లో కేసుల వల్ల జయలలిత ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురయ్యారు. అయినా సరే తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకేకు అత్యధిక స్థానాలు లభించాయి. జయలలితే (ఎన్నిక కాని శాసనసభ్యురాలు) సీఎంగా పగ్గాలు చేపట్టారు. జోస్యం నిజం కావడంతో ఉన్నికృష్ణన్ జయలలితకు నమ్మకమైన జ్యోతిషుడిగా మారారు. కానీ, ప్రతిఫలంగా ఉన్నికృష్ణన్ కు లభించిన 10 లక్షల రూపాయలపై పన్ను కట్టాలంటూ ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపింది. 3లక్షల రూపాయలు బహుమతి పన్నుగా చెల్లించాల్సి ఉంది. దీనిని సవాలు చేస్తూ ఉన్నికృష్ణన్ కేరళ హైకోర్టుకు వెళ్లారు.

  • Loading...

More Telugu News