: ఎయిరిండియాలో 'మున్నాభాయ్ ట్రయినర్'
ఇటీవల ఎయిరిండియాకు భద్రత ప్రమాణాల రీత్యా అమెరికా తక్కువ ర్యాంకును కేటాయించిన నేపథ్యంలో ప్రభుత్వరంగ విమానయాన సంస్థలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఓ సీనియర్ అధికారి అర్హతలు లేకున్నా ట్రయినర్ అవతారమెత్తి అందర్నీ నివ్వెరపరిచాడు. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అందించే ఇన్ స్ట్రక్టర్-ఎగ్జామినర్ సర్టిఫికెట్ లేకుండానే ఈ అధికారి ట్రయినీ పైలెట్లకు ఎయిర్ బస్ ఏ-330 విహంగ పాఠాలు బోధిస్తున్నాడు. సిమ్యులేటర్ క్లాసులు తీసుకోవడమే గాకుండా, విమానాల్లో రూట్ చెక్ ట్రయల్స్ కూ హాజరవుతూ ఇప్పుడు పై అధికారుల చేతికి చిక్కాడు. ఈ వ్యవహారంలో డీజీసీఏ లలిత్ గుప్తా విచారణకు ఆదేశించారు. తక్షణమే ఆ 'మున్నాభాయ్' ట్రయినర్ పైలెట్ లైసెన్స్ ను రద్దు చేయాలని నిర్ణయించారు.