: బార్బర్ అవతారమెత్తిన సల్మాన్ ఖాన్!


నటుడు సల్మాన్ ఖాన్ బార్బర్ గా మారి ఓ వ్యక్తికి జుట్టు కత్తిరించాడు. సల్మాన్ ఏంటి.. ఇలాంటి పని చేయడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే.. 'మిషన్ సప్నే' పేరుతో హిందీలో ఓ రియాలిటీ షో రూపొందుతోంది. చారిటీ బేస్ తో ఉన్న ఈ షోలో సెలబ్రిటీలు ఏదో ఒక పని చేసి, డబ్బులు సంపాదించాల్సి ఉంటుంది. అలా వచ్చిన సొమ్మును అవసరమైన వారికి ఇస్తారు. అలా ఈ కార్యక్రమానికి మద్దతు పలికిన సల్మాన్ కూడా ఓ ఎపిసోడ్ లో పాల్గొన్నాడు. అలా బార్బర్ అవతారమెత్తి రెండు కాళ్లు పోగొట్టుకున్న కుర్భాన్ అలీ అనే వ్యక్తికి సల్లూ చకచకా కటింగ్ చేశాడు.

  • Loading...

More Telugu News